‘ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జగన్‌పై హత్యాయత్నం’

YSRCP Leaders blame on Chandrababu Naidu - Sakshi

న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగింది మూమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్ట్‌లో తేటతెల్లమైందన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరిగిందనడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌లో పని చేస్తున్నాడని, అది టీడీపీకి చెందిన వ్యక్తి చేతుల్లోనే ఉందనే విషయాన్ని సుబ్బారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

‘రిమాండ్‌ రిపోర్ట్‌తో సగం వాస్తవాలు బయటకొచ్చాయి. సెల్ఫీ నెపంతో నిందితుడు శ్రీనివాస్‌.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశాడు. అదృష్టావశాత్తు వైఎస్‌ జగన్‌ పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. శ్రీనివాస్‌కు చంద్రబాబు ప్రభుత్వం రెండు ఇళ్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై మాకు నమ్మకం లేదు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. హత్యాయత్నంపై థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలి. నిందితులు ఎంతటివారైనా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి’ అని సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

మరో వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై న్యాయ విచారణ జరిపించాలి. టీడీపీ ప్రభుత్వ ప్రోద్భలంతోనే జగన్‌పై హత్యాయత్నం. వైఎస్‌ జగన్‌ ఆరోగ్యంపై ఆరా తీయాల్సిన చంద్రబాబు.. తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు.  వైఎస్‌ జగన్‌ను అంతమొందిస్తే ఎదురుండదని కుట్ర పన్నారు. పరామర్శించకుండా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా ఛీ కొడుతున్నారు. టీడీపీ మంత్రులు స్పందించే తీరు సరికాదు. చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని విమర్శించారు. ‘రిమాండ్‌ రిపోర్ట్‌లో వాస్తవాలు బయటకొచ్చాయి. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర ఉంది. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యాయత్నం. ఆరోపణలు చేయడం అన్యాయం. ఇది వరకే నేర చరిత్ర ఉన్న శ్రీనివాస్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం ఎలా ఇచ్చారు. వీటిన్నంటిపై న్యాయ విచారణ జరిపించాలి’ అని వరప్రసాద్‌ పేర్కొన్నారు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర‍్లు మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని ప్రదేశం చూసుకుని జగన్‌పై హత్యాయత్నం చేశారు. ఆపరేషన్‌ గరుడపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించలేదు. జగన్‌కు వస్తున్న ప్రజాదారణను చూసే హత్యాయత్నం’ అని తెలిపారు.

రిమాండ్‌ రిపోర్ట్‌; వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే!

ఆ ఫ్లాట్‌లోని వేరే గదిలోనే మరో ఇద్దరు అమ్మాయిలు!

‘హర్షవర్ధన్‌కు ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఒత్తిడి’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top