చంద్రబాబు రాజకీయ విష వృక్షం

YSRCP Leader Ramchandraiah Fire on Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య ఎద్దేవా

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 40 ఏళ్ల విష వృక్షమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్ర య్య ఎద్దేవా చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్ర బాబు బాగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఆయనను ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఎవరో సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే.. చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి ఆ పోస్టులోని బూతును మీడియా సమావేశంలో చదివి వినిపించటం దారుణమన్నారు. 

సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం
ఇలాంటి పోస్టులకు ఆద్యు  డు చంద్రబాబేనని రామచంద్రయ్య విమర్శించారు. పదేళ్లుగా సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు చేయించిన దుష్ప్రచారంపై విచారణ జరిపితే.. ఇది వ్యక్తులుగా చేసింది కాదని.. ఒక వ్యవస్థలా చేయించారనే విషయం తేలిందన్నారు. దాదాపు 2 వేల మందిని నియమించుకుని హైదరాబాద్‌లోని ఎన్‌బీకే బిల్డింగ్, టీడీపీ ఆఫీస్, విజయవాడలోని సోషల్‌ మీడియా కార్యాలయం నుంచి వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించారన్నారు. నెహ్రూ,   గాంధీ, ఇందిరా గాంధీ, మోదీలపైనా అత్యంత నీచమైన వ్యాఖ్యలు రాయించారని చెప్పారు. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై కూడా ఇష్టం వచ్చినట్లు రాయించి కించపరిచారని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top