‘రైతులను మోసం చేస్తున్న టీడీపీ బినామీలు ’

YSRCP leader MVS Nagi Reddy Fires on tdp - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. టీడీపీ బినామీలు మార్కెట్లలో చేరి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో రైతాంగ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపుగా 7 లక్షల హెక్టార్లలో సాగు తగ్గిందని నాగిరెడ్డి తెలిపారు. కానీ గవర్నర్‌ ప్రసంగంలో సాగు వృద్ధి చెందినట్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం కో ఆపరేటివ్‌ డైరీలను మూసేస్తూ.. అన్ని హెరిటేజ్‌ డైరీలను ప్రారంభిస్తున్నారని ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top