బలి గోరుతున్న ‘బాబు’ ప్రచారార్భాటం | YSRCP LEader Kanna Babu Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బలి గోరుతున్న ‘బాబు’ ప్రచారార్భాటం

Jul 16 2018 6:50 AM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP LEader Kanna Babu Fires On Chandrababu Naidu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు. చిత్రంలోమాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తదితరులు

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచారార్భాటం అమాయకులకు  ప్రా ణాంతకంగా  మారుతోందని వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.  పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తాపడి ఆరుగురు చిన్నారులు, ఓ మహిళ గల్లంతైన ఘటనకు సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.   గల్లంతైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్ల కిందట రాజమహేంద్రవరంలో పుష్కరాల ప్రారంభం సందర్భంగా దుర్ఘటన జరిగిన రోజే పశువుల్లంక ప్రమాదం జరిగిందని అన్నా రు.

అప్పుడు కూడా వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కరఘాట్‌ వద్ద చంద్రబాబు ప్రచారం కోసం చేసిన ఆర్భాటం వల్లే 29 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆదివారం కన్నబాబు స్థానిక డి కన్వెన్షన్‌ హాలులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కర దుర్ఘటనపై వేసిన సోమయాజులు కమిషన్‌ నివేదిక మూడేళ్ళు గడిచినా బయటకు రాలేదని, వీడియో ఫుటేజ్‌లు కూడా కనిపించకుండా పోయాయని విమర్శించారు. ఆ నాటి ఘటనపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా చంద్రబాబుపైనే తీసుకోవాలని, అందువల్లే ఆ వ్యవహారానికి ము గింపు పలికారని ఆరోపించారు. పైగా ఆ నాటి ఘటనలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి సహాయం అందించలేకపోయారని విమర్శించారు.

కాగా రెండవ శనివారం సెలవు అయినా వనం–మనం కార్యక్రమం కోసం వెళ్లిన విద్యార్థులు నాటుపడవలో వరద గోదావరి దాటుతున్న క్రమంలోనే పశువుల్లంక ప్రమాదం జరిగిందన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు సర్కారు చేస్తోన్న దిగజారుడు వ్యవహారాల వల్ల ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

ఎన్ని విషాదాలు జరిగినా కానరాని కదలిక
కొద్దిరోజుల క్రితం దేవీపట్నం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని కన్నబాబు అన్నారు. అంతకు ముందు కృష్ణానదిలో బోటు మునక ప్రమాదం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. పశువుల్లంక వద్ద వంతెన పిల్లర్‌ను ఢీకొని ప్రమాదం జరగడాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్‌ హయాంలో ప్రారంభించిన వంతెన పనులను ఆ తరువాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత ఘటనకు కారణమన్నారు. కమీషన్ల కోసం పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి పథకాలను ఆగమేఘాలపై చేపట్టిన టీడీపీ సర్కార్‌ ఈ వంతెన విషయంలో కమీషన్లు రావని నిర్లక్ష్యం చేసిం దా.. అని నిలదీశారు.

విశాఖలో కేవలం ఐదు గంటల్లో సొరంగమార్గం ఏర్పాటు చేసేంతగా సాంకేతికత అందుబాటులో ఉండగా ఇలాం  టి పనుల విషయంలో వెనుకడుగు వేయడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా అని ప్ర శ్నించారు. ఎండాకాలంలో మంచినీటి ప్ర ణాళిక, వర్షాకాలంలో రోగాలు, వ్యాధులు ప్ర బలకుండా కార్యాచరణ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, కార్పొరేషన్‌ ఫ్లో్లర్‌లీడర్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement