ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండన్నా..

YSRCP Kadapa MLA Candidate Amjad Bhasha Canvass - Sakshi

సాక్షి, కడప కార్పొరేషన్‌: ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండన్నా...ఒక్క సారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇద్దాం అన్నా.. అంటూ కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ‘రావాలి జగన్, కావాలి జగన్‌’ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యేకు, ఎంపికీ రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారని గుర్తు చేశారు. జగన్‌ సీఎం అయితే పింఛన్లు రూ.3వేలకు పెంచుతారని, ఆటో డ్రైవర్లకు, బార్బర్‌ షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేలు ఉచితంగా ఇస్తారన్నారు. వీధి వ్యాపారస్తులకు ప్రతి ఏటా పావలా వడ్డీకే రూ.10వేలు రుణం ఇవ్వడం జరగుతుందన్నారు. చిన్నపిల్లలను బడికి పంపితే ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తారన్నారు.
 
మన జిల్లావాసి, మన సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎం అయితే మన జిల్లాకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ మహమ్మద్‌ అన్సర్‌ అలీ, నాయకులు రెడ్డి ప్రసాద్, దాసరి శివప్రసాద్, మున్నా, షఫీ, గౌస్, మురళీ, గోపాలక్రిష్ణ, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top