​​​​​​​‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’ | YSRCP Former MP YV Subba Reddy Fires On TDP | Sakshi
Sakshi News home page

​​​​​​​‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’

Jul 17 2018 6:08 PM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP Former MP YV Subba Reddy Fires On TDP - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం టీడీపీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదో ప్రజల సమాధానం చెప్పాలన్నారు.

ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆవ్వానించడం నిబంధనలకు విరుద్దమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంలోనే టీడీపీ-బీజేపీ కుమ్మకైన విషయం వెల్లడైందని పేర్కొన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement