335వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan PrajaSankalpaYatra 335th Day Begins | Sakshi
Sakshi News home page

Jan 1 2019 7:42 AM | Updated on Jan 1 2019 9:09 AM

YS Jagan PrajaSankalpaYatra 335th Day Begins - Sakshi

వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.

సాక్షి, శ్రీకాకుళం : ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చిన్న వంకులూరు, అనకాపల్లి క్రాస్‌, రంగోయి క్రాస్‌, రాంనగర్‌, బహడపల్లి, నల్లబొడ్లూరు, గుజ్జులురు, బి జగన్నాథపురం మీదుగా నారయణపురం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement