
సాక్షి,అమరావతి: అతి తక్కువ కాలంలో దేశంలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ సీఎంగా వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారని .. వచ్చే ఏడాది కచ్చితంగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ చంద్రబాబుకు ఇది సాధ్యం కాలేదన్నారు. అవినీతిలో బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు.
అనిల్‌కుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాటాడుతూ.. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా ఏం లాభం.. సీఎం వైఎస్ జగన్ ఇక్కడే కూర్చొని ప్రపంచాన్ని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. మంత్రులు మద్యం సేవించి, శాసన మండలికి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తన బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని, తనకు మద్యం అలవాటు ఉన్నట్లు నిరూపించాలని అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.