అప్పుడు ఎందుకు తీసుకెళ్లలేదు? | That is why All party meeting | Sakshi
Sakshi News home page

అప్పుడు ఎందుకు తీసుకెళ్లలేదు?

Mar 27 2018 12:35 PM | Updated on Aug 10 2018 8:42 PM

That is why All party meeting - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ (పాత చిత్రం)

సాక్షి, అమరావతి : అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. అమరావతిలోని బీజేపీ కార్యాలయంలో రాజమండ్రి అర్బన్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పార్టీ నాయకుడు మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగిన వారిపై ఎందుకు దాడులు చేయించారని చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు హడావిడిగా అఖిలపక్షం ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. 

అఖిలపక్షాన్ని రాత్రికి రాత్రికి ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. సీఎం 29సార్లు ఢిల్లీకి తీసుకెళ్లినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని సూటిగా అడిగారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కులాల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్రభుత్వం భయపడటం లేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement