సాక్షి, అనంతపురం: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మరోసారి విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశంలో మైనర్ బాలికల పేర్లు వెల్లడించారని గోరంట్ల మాధవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై గతంలో ఫిర్యాదు చేశారు. కాగా తన వ్యాఖ్యలపై ఇప్పటికే గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి విజయవాడ పోలీసుల విచారణకు కూడా మాధవ్ హాజరయ్యారు. అయితే తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.


