బెంగాల్‌ ఉప ఎన్నికల్లో తృణమూల్‌ హవా

West Bengal bypolls see clean sweep for ruling TMC - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతదీదీకి మళ్లీ జోష్‌ వచ్చింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇన్నాళ్లూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రాతినిధ్యం వహించిన ఖరగ్‌పూర్‌ సదార్‌ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ రెండో స్థానానికే పరిమితమైంది. కళాయిగంజ్, ఖరగ్‌పూర్‌ సదార్, కరీంపూర్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు వరసగా తపన్‌ దేబ్‌ సిన్హా, ప్రదీప్‌ సర్కార్, బిమలేందుసిన్హా రాయ్‌లు విజయం సాధించినట్టు గురువారం ఎన్నికల సంఘం ఫలితాలు విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న బీజేపీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టు వంటివని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర రిజిస్టర్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలే బెంగాల్‌లో బీజేపీ ఓటమికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ అంగీకరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top