ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే : ఉత్తమ్‌ | we are ready to pre-election: uttam | Sakshi
Sakshi News home page

ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే : ఉత్తమ్‌

Jan 31 2018 4:14 PM | Updated on Mar 18 2019 9:02 PM

we are ready to pre-election: uttam - Sakshi

పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ జరగదనేది తమ అభిప్రాయమని, డీలిమిటేషన్ పై వాళ్లేం చేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సమయం, ఇతర పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదనుకుంటున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజమన్నారు. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తుందని, దానిపై ఏదైనా క్లారిటీ వస్తే చెబుతామన్నారు. 102 సీట్లు గెలుస్తామని చెప్పడం, మా శ్రేణులను బలహీన పరిచే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు.

 మహాభారతంలో ఎక్కువ అస్త్రాలు, జనం కౌరవుల వద్దే ఉన్నాయని, అయినా పాండవులే గెలిచారని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయం మావైపే ఉందని మేం విశ్వసిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లోనే రెండు పంటలు వేస్తున్నారని తెలిపారు. ఇందులో 62 శాతం రైతులు 2.5 ఎకరాలలోపే భూమి కలిగి ఉన్నారని, మెజారిటీ రైతులకు రూ. 2 వేల నుంచి మూడు వేలలోపే పెట్టుబడి సాయం అందుతుందన్నారు. అదే గిట్టుబాటు ధర, బోనస్ కల్పిస్తే రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు క్వింటాలుకు రూ. వంద తగ్గినా ఇచ్చే పెట్టుబడి సాయం చెల్లుకు చెల్లవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement