
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టీడీపీ దుర్మార్గ కోరిక. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు.’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.