'ఆ పత్రికల రిపోర్టర్లపై చర్యలు తీసుకోండి'

Vijaya Sai Reddy Gave Complaint To Loksabha Speaker In New Delhi - Sakshi

న్యూఢిల్లీ : తనపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లోక్‌సభ స్పీకర్‌తో పాటు సభా హక్కుల కమిటీకి  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో తనకు క్లాస్‌ తీసుకున్నారని దురుద్దేశ పూర్వకంగా కథనాలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

జర్నలిజం ఎథిక్స్‌ ప్రకారం కనీసం తనని సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాన్ని ప్రచురించారన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తప్పుడు సమాచారం ప్రచురించినందుకు సదరు పత్రిక రిపోర్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అలాగే వారికి సంబంధించిన పార్లమెంట్లు ఎంట్రీ పాసులు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచురించడం వల్ల ఎంపీగా తనకే కాకుండా పార్లమెంటు వ్యవస్థను సైతం అవమానపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top