ఎమ్మెల్సీ అ‍భ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ | Uttam Kumar Confirms Jiveen Reddy Is MLC Candidate | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ అ‍భ్యర్థిగా మాజీమంత్రి జీవన్‌ రెడ్డి..!

Feb 26 2019 6:51 PM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Confirms Jiveen Reddy Is MLC Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టుభద్రుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్‌ రెడ్డిని ఎంపిక చేసినట్లు టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకర్గం నుంచి జీవన్‌ రెడ్డిని బరిలో నిలుపుతున్నట్ల ఉత్తమ్‌ తెలిపారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి జీవన్‌ రెడ్డి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా.. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆయనను పోటీలో నిలపాలని డిమాండ్‌ చేయడంతో కాంగ్రెస్‌ ఆయనను బరిలో నిలిపింది. ఈ స్థానం కోసం కాంగ్రెస్‌  నుంచి చాలామంది పోటీపడగా.. అధిష్టానం జీవన్‌ రెడ్డికే మెగ్గుచూపింది.

కాంగ్రెస్‌తో సీనియర్‌ నేతైన జీవన్‌ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల స్థానం నుంచి పోటీచేసి అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేపు జీవన్‌రెడ్డిని‍ అధికారికంగా ప్రకటిస్తామని ఉత్తమ్‌ తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానం కోసం అ‍భ్యర్థిని ఈరోజు రాత్రి నిర్ణయిస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌ అభ్యర్థులపై టీపీసీసీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయ్యిందనీ, డీసీసీలు పంపిన జాబితాపై చర్చించి షార్ట్‌ లిస్ట్‌ను తయారుచేశామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement