‘ఆ చెప్పులతోనే కొట్టాలనిపించింది’

Uddhav Thackeray slams Yogi Adityanath - Sakshi

యూపీ సీఎంపై ఉద్దవ్‌ థాక్రే తీవ్ర వ్యాఖ్యలు

ముంబై : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), శివసేనల మధ్య మాటల యుద్దం రోజురోజుకు పెరుగుతోంది.  పాల్ఘడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ థాక్రే, సీఎం ఫడ్నవీస్‌ ఆడియో టేపును విడుదల చేశారు. ఆ టేపులో ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలున్నాయి. అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఉద్దవ్‌ థాక్రే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో యోగిని ఓ భోగి అని సంబోదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరాఠా వారియర్‌ అయిన చత్రపతి శివాజీ ఫొటోకు యోగి చెప్పులు ధరించి పూలమాల వేయడాన్ని థాక్రే  తప్పుబట్టారు. ‘అది చూశాక అవే చెప్పులతో యోగి చెంపలు పగలగొట్టాలనిపించింది. యోగి అంటే అన్ని వదిలి కొండల మధ్య జపం చేసుకోవాలి. కానీ ఈయన మాత్రం సీఎం కుర్చీ మీద కుర్చున్నారు. అతను యోగి కాదని, భోగి’ అని రాసుకొచ్చారు. ఇక పాల్ఘడ్‌ లోక్‌సభ స్థానానికి  జరగబోయే ఉప ఎన్నికల్లో శివసేనదే గెలుపని థాక్రే ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top