సొంత నాయకులనే గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు

Two BSP Leader Garlanded With Shoes And Paraded On Donkey In Rajasthan - Sakshi

జైపూర్‌ : పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలను సొంత పార్టీ కార్యకర్తలే గాడిదలపై ఊరేగించిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది.  వివరాలు.. గత మంగళవారం బనీపార్క్‌లోని బీఎస్పీ కార్యాలయం ముందు పార్టీ నేషనల్‌ కోఆర్టీనేటర్‌ రామ్‌జీ గుప్తా, మాజీ ఇంచార్జ్‌ సీతారాంలను కార్యకర్తలు చుట్టుముట్టారు. వారి ముఖాలకు నల్లరంగు పులిమి, మెడలో చెప్పుల దండ వేశారు.అనంతరం గాడిదలపై ఊరేగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తోన్న కార్యకర్తలను కాదని వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని ఆరోపించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని కార్యకర్తలను మోసం చేశారని మండిపడ్డారు. తమ గోడును అధినేత్రి మాయావతికి తెలియనీయకుండా చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా మాయావతికి దగ్గరకు పంపించలేదని, అందుకే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని చెప్పారు. కాగా ఈఘటనపై మాయావతి స్పందించారు. పార్టీ నేతలు ఇలా చేడయం సిగ్గుచేటని, ఈ ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top