టీఆర్‌ఎస్‌ మరో భారీ బహిరంగసభ!

TRS Again Will Arrange Huge Meet At Husnabad - Sakshi

ముందస్తుపై దూకుడు పెంచిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రగతి నివేదన సభ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. సెప్టెంబర్‌ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభను నిర్వహించి విజయవంతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై మరింత దూకుడు పెంచారు.

జెట్‌ స్పీడ్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తూ‌.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈ రోజు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు సిద్దిపేటలో సమావేశం కానున్నారు. మరోవైపు ప్రభుత్వ సీఎస్‌ జోషితో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు భేటి అయ్యారు. దీంతో ఈ నెల 6న జరిగే కేబినేట్‌ మీట్‌ అనంతరం కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top