కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షాకిచ్చిన టీపీసీసీ | TPCC Once Again Issues Show Cause Notice To Komatireddy Rajagopal Reddy | Sakshi
Sakshi News home page

Sep 24 2018 8:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

TPCC Once Again Issues Show Cause Notice To Komatireddy Rajagopal Reddy - Sakshi

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది

సాక్షి, హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తాను చేసిన వ్యాఖ్యాలపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. సోమవారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్‌ రెడ్డి వివరణ సరిగా లేదని పేర్కొంది. తనకు నోటీసులు ఇచ్చే స్థాయి కమిటీకి లేదనటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజగోపాల్‌ వివరణతో సంతృప్తి చెందని కమిటీ మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 

గత శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో లో క్రమశిక్షణ కమిటీపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవి చదవండి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement