టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి..

TJR Sudhakar Babu Takes On Devineni Uma Controversy Comments - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ హుందాతనాన్ని మరిచి వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలను టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్‌... వైఎస్సార్‌ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం మీ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి.  రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే.

కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు మీరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు మీరు. మా నాయకుడు... మీ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’  అంటూ సవాల్‌ విసిరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top