బ్రేకింగ్‌: 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు

Telangana Election Along With Four States - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు. డిసెంబర్‌ రెండో వారం కల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల పక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. గతంలోని ఎన్నికల షెడ్యూళ్లను చూసుకుంటే చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లోనూ, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పక్రియను వేగవంతం చేసిన ఎన్నికల సంఘం అక్టోబర్‌ 8 కల్లా ఓటరు జాబితా తుది ముసాయిదాను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top