బీజేపీవి చీకటి ఒప్పందాలు

Telangana Congress Incharge RC Khuntia Slams BJP - Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎంతో చీకటి ఒప్పందాలు చేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఆరోపించారు. ఆదివారం నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎంఐఎంతో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ముíస్లిం ఓట్లను ఎంఐఎం పార్టీకి, హిందువుల ఓట్లను బీజేపీ చీల్చుకొని కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తూ.. దీనికి చీకటి ఒప్పందాలే కారణమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో బీజేపీకి చెందిన అరెస్సెస్‌ ర్యాలీకి, ఎంఐఎం బహిరంగ సభకు అనుమతి స్తుందని కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్స వం రోజు తమ పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటామంటే అనుమతి ఇవ్వలేదన్నారు.  సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ అంటే వె న్నులో భయం పుట్టుకొస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్‌ అన్నారు. సమావేశం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంఎస్‌సీ భోస్‌రాజు, టీపీసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top