రేపటి నుంచి అసెంబ్లీ

Telangana Assembly Session On February 22nd - Sakshi

తొలిరోజు తాత్కాలిక బడ్జెట్‌

మూడు రోజులపాటు సమావేశాలు

ఏర్పాట్లపై స్పీకర్‌ పోచారం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసన సభ, శాసన మండలి లో ప్రభుత్వం తాత్కాలిక (ఓటాన్‌ అకౌంట్‌) బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. ఆదివారం బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. సోమవారం ద్రవ్యవిని యోగ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. శాసన సభ, శాసన మండలి సమా వేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పీకర్‌ చాం బర్‌లో జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మ న్‌ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేము ల ప్రశాంత్‌రెడ్డి, ఎస్‌టీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, హైదరాబాద్‌ నగ ర పోలీస్‌ కమిషనర్‌ అంజనాకుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

పోచారం మాట్లాడుతూ... ‘శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25 వర కు జరుగుతాయి. మొత్తం 3 రోజులు సమావేశాలు సాగుతాయి. అందరి సహకారంతో శా సనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో భేటీకావడం ఆనవాయితీ అని మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ అన్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి అందరి సహకారం అవసరమని చెప్పా రు. శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top