వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై కారెక్కించిన సీఎం రమేష్‌

TDP MP CM Ramesh Rammed Car On To The YSRCP Agent - Sakshi

సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ఉన్న 248 పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డిపై  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ దాడి చేసి, ఆ ఏజెంట్‌పై కారు ఎక్కించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన చూసి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరు భయభ్రాంతులయ్యారు. బాధితుడు, వైఎస్సార్‌సీపీ ఏజెంటు పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్, అతని కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  పోట్లదుర్తి గ్రామానికి చెందిన పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డి  గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లోని 241 పోలింగ్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తరుపున ఏజెంటుగా కూర్చున్నాడు. గ్రామంలోని ఎస్సీ వసతి గృహంలో 248 పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలిసి రిలీవర్‌ ఏజెంట్‌ గా ఉన్న వెంకట సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చారు.

అదే సమయంలో అక్కడకు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అక్కడ ఉన్న మరో వ్యక్తితో నీవు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి మీరు కూడా ఏజెంట్‌ కాదు కదా ఎందుకు వచ్చారని ఎంపీ రమేష్‌తో అన్నారు. అంతే.. సీఎం రమేష్‌ ఆగ్రహించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ అయిన వెంకటసుధాకర్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానానికి గురైన వెంకటసుధాకర్‌రెడ్డి తనకు ఎంపీ రమేష్‌ క్షమాపణ చెప్పాలంటూ అతని కారుకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించాడు. దీంతో ఆగ్రహించిన రమేష్‌ తన కారును సుధాకర్‌రెడ్డిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సుధాకర్‌రెడ్డి ఎడమ కాలు పాదం విరిగి వాపుడు గాయం అయింది. వెంటనే పోలీసులు సుధాకర్‌రెడ్డిని బలవంతంగా కారులో ఆçస్పత్రికి తరలించారు. ఈ మేరకు పడిగపాడి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్‌తో పాటు, అతని కారు డ్రైవర్‌లపై  సెక్షన్‌ 323, 324, ఆర్‌/డబ్లు్య 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top