‘మాటల్లో కాదు.. చేతల్లో ఉండాలి’

Tammineni Veerabhadram Fires On Telangana Government - Sakshi

సాక్షి, వరంగల్ ‌: సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు పంపణీ చేయడమేనా అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ప్రశ్నించారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం సంతోషంగా ఉందని, అయితే మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు.

రానున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 119 స్ధానాల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.  కొత్తగా వచ్చిన కోదండరామ్‌ పార్టీ కూడా సామాజిక న్యాయం అంటుందని దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే సీపీఎం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కోదండరామ్‌, పవన్‌ కల్యాణ్‌లతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... చర్చలు నడుస్తున్నాయని, ఇంకా స్పష్టత రాలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top