వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు : సురేశ్‌ ప్రభు

Suresh Prabhu Comments About NRC And Citizenship Amendment Act - Sakshi

సాక్షి, విజయవాడ : జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) చట్టంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ.. జనాభా గణనకు, పౌరసత్వ చట్ట సవరణకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అస్సొం మినహా ఎన్నార్సీ మరెక్కడా అమలు కాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయపక్షాలు వాస్తవాలను బయటికి చెప్పకుండా దుష్ప్రచారంతోనే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న పలు కీలకమైన అంశాల్లో బీజేపీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇప్పటికే ఎన్నార్సీ , సిఎఎ చట్టాలపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదని అందుకే ఈ చట్టం వల్ల దేశంలోని హిందువులకు, ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top