కాంగ్రెస్‌కు దానం నాగేందర్‌ గుడ్‌బై

Sr congress leader Danam Nagender resigns from party - Sakshi

పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది

సోనియా, రాహుల్, ఉత్తమ్‌లకు లేఖలు

మంత్రి తలసానితో భేటీ, టీఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనమే

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ ఎన్నికలు ఐదా రు నెలల్లోనే ఉంటాయని ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలక నాయకుడు దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమి క సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్, పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు రాజీనామా లేఖ పంపారు.

బడుగులు, బీసీలకు పార్టీలో అన్యా యం జరుగుతున్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేశాను. అయితే జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం, మారుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీలోని జాతీయ, రాష్ట్ర పెద్దలతో చర్చించినా పెడచెవిన పెట్టారు. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభద్రత, అసంతృప్తితో ఉన్నారు.

సమన్వయ లేమి, కార్యకర్తలతో సంప్రదింపులు జరపకపోవడం, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో వారంతా తప్పని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితులే నన్ను రాజీనామా దిశగా అడుగులు వేయించాయి. పార్టీ పునర్నిర్మాణం, బీసీల సంక్షేమంపై చర్చించాలని చాలామార్లు ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ నాయ కత్వం నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు’’అని లేఖలో దానం పేర్కొన్నారు.

మొదట్నుంచీ ప్రచారమైనట్టుగానే...
నిజానికి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం 2014 ఎన్నికలు ముగిసిన నాటి నుంచీ ఉంది. ఆయన కాంగ్రెస్‌కు చాలా రోజు లుగా దూరంగా ఉన్నారు. 2015 గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా దానం టీఆర్‌ఎస్‌లో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ మేరకు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ పెద్దల నుంచి సరైన హామీ రాక చేరిక వాయిదా పడింది.

కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ స్వయంగా మాట్లాడి, పార్టీలో కొనసాగాలని, గ్రేటర్‌లో బలోపేతం చేయాలని కోర డంతో దానం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పార్టీ పదవుల భర్తీలో దానం పేరును పార్టీ పట్టించుకోలేదు.  నగర అధ్యక్ష పదవి నుంచి తొలగించి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను నియమించడంపై దానం ఆగ్రహించారు.

ఐఏసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని దానం ఆశించినా నిరాశే మిగిలింది. ఏఐసీసీ కార్యదర్శిగా శుక్రవారం ఎమ్మెల్యే సంపత్‌ను ప్రకటించడంతో దానం మరింత అసంతృప్తికి లోన య్యారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా బీసీ వర్గానికి చెందిన దానంను చేర్చుకునేందుకు పార్టీ సిద్ధపడటం, ఆ దిశగా చర్చలు ఫలప్రదం కావడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

బుజ్జగించేందుకు..
దానం రాజీనామా సమాచారం అందగానే ఉత్తమ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని వెంటపెట్టుకొని దానం ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోవడంతో కలవలేకపోయారు. ఫోన్‌లో సం ప్రదించే ప్రయత్నం చేసినా దానం అందుబాటులోకి రాలేదు. బుజ్జగింపు యత్నాలు జరుగుతుండగానే దానం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో భేటీ అయ్యారనే సమాచారం అందడం, టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని తేలడంతో కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలను విరమించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top