అనువాదంలో అబద్ధాలు జోడించారు

Sonia's speech sounded like Naidu's script - Sakshi

సోనియా ప్రసంగంపై కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: యూపీఐ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ హిందీలో మాట్లాడిన మాటల్లో లేని వాటిని కాంగ్రెస్‌ నేతలు తెలుగు అనువాదంలో జోడించి చెప్పారని కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్‌ సభలో సోనియా, రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారనీ, సోనియా మాట్లాడిన హిందీ చాలామందికి అర్థమైందన్నారు. అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా చేర్చారని వినోద్‌ ఆరోపించారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్‌ చెప్పారని తెలి పారు. సోనియా మొదట తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరును మార్చాలని వినోద్‌ సూచించారు. దేశంలో తెలంగాణకు  పాలనలో అనేక అవార్డులు, రివార్డు లు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ మం త్రులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును కొనియాడారని గుర్తుచేశారు. ఇలా నవజ్యోత్‌సిద్దూ, రేవణ్ణలు ఇసుక పాలసీ, గొర్రెల పంపకంపై తెలంగాణ ప్రభుత్వా న్ని కొనియాడారని ఉటంకించారు. కేసీఆర్‌ ఆమరణదీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామన్న ప్రకటన అమలు ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయి.

ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలు కారణమన్న సంగతి కోదం డరాంకు తెలియదా? అని ప్రశ్నించారు. డిసెంబర్‌ 11న సోనియా సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇక రాహుల్‌ ప్రసం గం విన్న తర్వాత దేనితో కొట్టుకోవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కొమరంభీంను, అంబేడ్కర్‌ను విస్మరించామని అంటున్నారనీ, ఓ జిల్లాకు కొమరం భీం పేరు పెట్టిన విషయం రాహుల్‌కు స్థానిక నేతలు చెప్పలేదా? అని నిలదీశారు. అంబేడ్కర్‌ పేరు ప్రాణహితకు యథావిధిగా కొనసాగుతోందన్నారు. కాం గ్రెస్‌ ప్రణబ్‌ కమిటీ వేసినా అన్ని పార్టీలను తెలంగాణకు ఒప్పించింది టీఆర్‌ఎస్‌ పార్టీయేననీ, ప్రణబ్‌ కమిటీకి మెజారిటీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణను చంటిబిడ్డలా కేసీఆర్‌ సాకుతున్నారని వెల్లడించారు.   

హోదా అంటే ఏమిటో చెప్పాలి..
ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్‌ నిర్వచనం చెప్పాలని వినోద్‌ కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఎవరూ ఇవ్వలేరనీ, ఏపీకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే పన్నుల ప్రోత్సాహకాలు ఇస్తే తామే కాదు కర్ణాటక, తమిళనాడు కూడా వ్యతిరేకిస్తాయన్నారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా ఇస్తానంటోందనీ, చంద్రబాబు దాన్ని తీసుకుంటా అంటున్నారనీ విమర్శిం చారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసహనంతోనే టీఆర్‌ఎస్‌ను బొంద పెడతా అంటున్నారని విమర్శించారు. ఉత్తమ్‌ ఇంకా ప్రచారమే ప్రారంభిం చలేదని, కాంగ్రెస్‌ గాంధీభవన్‌ నుంచి పాలించాల్సిం దేనని, వారు మాక్‌ అసెంబ్లీ పెట్టుకోవాల్సిందేనని వినోద్‌ చమత్కరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top