ఖాళీగా లేను వచ్చేవారం రా!  | Smriti Irani posts funny working weekends meme | Sakshi
Sakshi News home page

ఖాళీగా లేను వచ్చేవారం రా! 

Jul 14 2019 8:13 AM | Updated on Jul 14 2019 9:08 AM

Smriti Irani posts funny working weekends meme  - Sakshi

స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో స్మృతి ఇప్పుడు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను చూస్తున్నారు. తగిన శాఖే అనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ప్రసన్నవదనంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. సమస్యను సీరియస్‌గా తీసుకోరు. కానీ సీరియస్‌గా సాల్వ్‌ చేస్తారు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు ఆమె పెడుతుండే పోస్టులు పొట్ట చెక్కలు చేస్తుంటాయి. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌.. ఒక జీవిత సత్యాన్ని చెబుతుంటాయి. లేటెస్టుగా నిన్న శనివారం స్మృతి హాయిగా నవ్వించే పోస్టు ఒకటి పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు వీకెండ్స్‌ కూడా పనిచేస్తుండే వారి మీద! ఆ పోస్టుకు కొద్ది గంటల్లోనే పదివేల లైక్స్‌ వచ్చాయి. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ ఓ సన్నివేశంలో ‘శభాష్‌’ అంటాడు. అది బాగా పాపులర్‌ అయిన సీన్‌. అలా అంటున్నప్పుడు ఆమిర్‌ పెట్టిన ఫీలింగ్స్‌ చూడాల్సిందే. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. కింద ఇలా కామెంట్‌ రాశారు స్మృతి. 

‘‘ఖాళీగా లేను వచ్చేవారం రా.. అని మీరు మీ వీకెండ్‌తో అన్నప్పుడు..’’ అని రాశారు. వీకెండ్‌ని సింబలైజ్‌ చేస్తూ పైన ఆమిర్‌ ఫొటో.. శభాష్‌ అంటూ ఉంటుంది. వీకెండ్‌లో కూడా బిజీగా ఉండేవాళ్లపై వేసిన ఈ సున్నితమైన సెటైర్‌ వాళ్లను అర్థం చేసుకుంటూనే, లైఫ్‌కి అంత అవసరం లేదు అని చెప్పినట్లూ ఉంది. 

‘‘మీరు మీ ఇన్‌స్టా అకౌంట్‌ని గొప్పగా హ్యాండిల్‌ చేస్తున్నారు స్మృతీ. ఐ లవ్‌ ఇట్‌’’ అని ఒకరు. ‘‘యు ఆర్‌ సో ఫన్నీ మేమ్‌’’ అని ఇంకొకరు. ‘‘మీ హాస్య చతురత చంపేస్తోంది’’ అని మరొకరు.. స్మృతి పోస్ట్‌కి కామెంట్స్‌ పెట్టారు. ప్రొడ్యూజర్‌ ఏక్తా కపూర్, నటి దివ్యాసేథ్‌ షా కూడా లైక్‌ కొట్టారు. ఈ పోస్ట్‌ని చూశాక ఎవరికి మాత్రం వీకెండ్‌ని ఎంజాయ్‌ చేయాలనిపించదు చెప్పండి. పని కూడా ఎంజాయ్‌మెంటే అనుకునేవాళ్లకు అసలు ప్రాబ్లమే లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement