మహిళా ఎంపీలు 78 మంది

Record 78 women MPs in new Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 78గా ఉంది. అంటే మొత్తం లోక్‌సభ ఎంపీల్లో మహిళల సంఖ్య దాదాపు 14 శాతం. 16వ లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 62 మాత్రమే కాగా, ప్రస్తుతం అది 78కి పెరిగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇది అతి స్వల్పం. రువాండా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏకంగా 61 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో చట్టసభల్లో 43 శాతం మంది, యూకేలో పార్లమెంటులోనూ 32 శాతం మంది మహిళలు ఉన్నారు. అమెరికాలో 24 శాతం, బంగ్లాదేశ్‌లో 21 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కొత్త ంపీలపై పీఆర్‌ఎస్‌ ఇండియా సంస్థ ఒక విశ్లేషణను విడుదల చేసింది. ఆ వివరాలు..

300 మంది తొలిసారి ఎన్నికైన వారే
తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన వారు కొత్త సభలో 300 మంది ఉన్నారు. 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 314. 16వ లోక్‌సభలో సభ్యులుగా ఉండి, మళ్లీ 17వ లోక్‌సభకు కూడా ఎన్నికైన వారి సంఖ్య 197 కాగా, మరో 45 మంది 16వ లోక్‌సభలో కాకుండా, అంతకు ముందు సభల్లో సభ్యులుగా ఉన్నవారే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top