ఏపీ ఎన్నికలు : 7 పోలింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్‌..

Re Polling Starts In 7 Polling Centres In Chandragiri Constituency - Sakshi

సాక్షి, చిత్తూరు : ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో యుగంధర్‌ అనే వ్యక్తి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించాడు. ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారుచంద్రగిరిలో రీపోలింగ్‌ ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ ఓటింగ్‌ శాతం అమాంతం పెరుగుతోంది.
ఐదు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌ల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం
పులివర్తివారిపల్లి: 91.68 శాతం
కాలేపల్లి : 94.14
వెంకటరామాపురం: 89.66 
కొత్త కండ్రిగ 81.84
కమ్మపల్లి: 71.21
ఎన్‌ఆర్‌ కమ్మపల్లి: 87.54
కుప్పం బాదూర్‌: 89.01

చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు అవకాశముంది. మధ్యాహ్నాం 4 గంటల వరకు 77.13 శాతం పోలింగ్‌ నమోదైంది. 
నాలుగు గంటల వరకు నమోదైన పోలింగ్‌ వివరాలు
కాలేపల్లి:                  77.55 శాతం
కమ్మపల్లి:                54.96
పులవర్తివారి పల్లి:      70.81
కుప్పం బాదురు:        67.02 
ఎన్‌ఆర్‌ కమ్మపల్లి:      72.49
కొత్త కండ్రిగ:              61.86
వెంకటరామాపురం:    86.21  

చంద్రగిరిలో పటిష్ట బందోబస్తు మధ్య రీపోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నాం 3 గంటల వరకు 67.55 శాతం పోలింగ్‌ నమోదైంది. 

మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్‌ వివరాలు:
1) 321- ఎస్‌ఆర్‌ కమ్మపల్లి మొత్తం ఓట్లు: 698
పోల్‌ అయిన ఓట్లు: 506 పోలింగ్‌ శాతం: 72.49

2) 104- పులివర్తిపల్లి మొత్తం ఓట్లు: 805
పోల్‌ అయిన ఓట్లు: 570 పోలింగ్‌ శాతం: 70.81

3) 316- కొత్త కండ్రిగ మొత్తం ఓట్లు: 991
పోల్‌ అయిన ఓట్లు: 613 పోలింగ్‌ శాతం: 61.86

4) 318- కమ్మపల్లి మొత్తం ఓట్లు: 1028
పోల్‌ అయిన ఓట్లు: 565 పోలింగ్‌ శాతం: 54.96

5) 313- వెంకట్రామాపురం మొత్తం ఓట్లు: 377
పోల్‌ అయిన ఓట్లు: 325 పోలింగ్‌ శాతం: 86.21

6) 310- కాలేపల్లి మొత్తం ఓట్లు: 597
పోల్‌ అయిన ఓట్లు: 463 పోలింగ్‌ శాతం: 77.55

1) కుప్పంబాధర్‌  మొత్తం ఓట్లు: 955
పోల్‌ అయిన ఓట్లు: 640 పోలింగ్‌ శాతం: 67.02

 చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగిన పోలింగ్‌లో వెంకట రామాపురం ముందంజలో ఉంది.
పులివర్తివారిపల్లి:       55.03
కాలేపల్లి:                   57.45
వెంకట రామాపురం:    79.58
కొత్తకండ్రిక:                45.61
కమ్మపల్లి:                 38.42
ఎన్‌ఆర్‌ కమ్మపల్లి:       52.87
కుప్పం బాదర్‌:           51.40

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో ఆదివారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు వినోద్‌ జుక్షి  భేటీ అయ్యారు. ద్వివేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రీపోలింగ్‌ సరళిని వివరించారు. అలాగే ఈ నెల 23న కౌంటింగ్‌ ఏర్పాట్లుపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటల వరకూ 31.92 శాతం పోలింగ్ 
చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్‌ బూత్‌ల్లో రీపోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెంకట రామాపురంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకూ నమోదు అయిన పోలింగ్‌ శాతం..

ఎన్ ఆర్ కమ్మపల్లి  మొత్తం ఓట్లు: 698 
ఇప్పటి వరకు పోల్ అయిన ఓట్లు: 239 
పోలింగ్‌ శాతం: 34.24

పుల్లివర్తివారిపల్లి మొత్తం ఓట్ల: 805
పోల్ అయిన ఓట్లు: 266
పోలింగ్‌ శాతం : 33.04

కొత్త కండ్రిగ మొత్తం ఓట్లు: 991
పోల్ అయిన ఓట్లు: 259
పోలింగ్‌ శాతం:26.14

కమ్మపల్లి  మొత్తం ఓట్లు: 1028
పోల్ అయిన ఓట్లు:  237 
పోలింగ్‌ శాతం: 23.05

వెంకట రామాపురం మొత్తం ఓట్లు: 377
పోల్ అయిన ఓట్లు: 195 
పోలింగ్‌ శాతం: 51.72 

కాలేపల్లి మొత్తం ఓట్లు: 597
పోల్ అయిన ఓట్లు:214 
పోలింగ్‌  శాతం: 35.85

కుప్పం బాదూరు మొత్తం ఓట్లు: 955
పోల్ అయిన ఓట్లు: 330
పోలింగ్‌ శాతం: 34.55

టీడీపీ నేత దౌర్జన్యం..
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ జరుగుతున్న కమ్మపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జయచంద్ర నాయుడు  ఆదివారం ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్‌ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ... జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రీపోలింగ్‌ జరుగుతున్న ఏడు ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల ద్వారా అధికారులు సమీక్షిస్తున్నారు.

వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుంది.. 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రీ పోలింగ్‌ జరుగుతున్న వెంకట్రామపురం పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన ఆదివారం ఉదయం పరిశీలించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు, మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు. ఇక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బెట్టింగ్స్‌ కోసమే ఆయన సర్వేలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెప్పి... ఈ ఎన్నికల్లో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వైపు మాట్లాడుతున్నారు.’ అని అన్నారు. కాగా రీ పోలింగ్‌ సందర్భంగా ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో దళితులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎన్నికల్లో తమ ఓట్లను రిగ్గింగ్‌ చేసేవారని, బందోబస్తు మధ్య తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.


సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

బెట్టింగ్స్‌ కోసమే ఆయన సర్వేలు

చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్‌ మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజక వర్గంలోని సి కాలేపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించారు. కాగా సాయంత్రం 6 గంటలకు రీపోలింగ్‌ ముగియనుంది. పాకాల మండలంలోని పులివర్తిపల్లి, కుప్పంబాదులో, రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో రీపోలింగ్‌ జరుగుతోంది. 7 పోలింగ్‌ కేంద్రాల్లోని మొత్తం 5451మంది ఓటర్లు తమ ఓటువేయనున్నారు. వీరిలో పురుషులు 2638 మంది, మహిళలు 2813 మంది ఉన్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తివారిపల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలింగ్‌ కేంద్రాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఈసీ అక్కడ రీ పోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు కాలేపల్లి, కుప్పం బాదూరు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా రీ పోలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో కూడా రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీ పోలింగ్‌ కొనసాగుతోంది.

ఎక్కడ ఎంతమంది..!

గ్రామం/పోలింగ్‌ కేంద్రం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు
ఎన్‌ఆర్‌ కమ్మపల్లి 698 336 362
పులివర్తిపల్లి 805 391 414 
కొత్తకండ్రిగ 991 482 509
కమ్మపల్లి 1028 490 538
వెంకట్రామపురం 377 179 198
కాలేపల్లి 597 295 302
కుప్పంబాదూరు 955 465 490

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top