చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి

Ramdas Kadam Comments BJP And Shiv Sena Alliance Pacts - Sakshi

ముంబై: మహారాష్ట్ర సీఎం పదవిని రెండున్నరేళ్ల పాటు పంచుకుందామనే ఒప్పందంతోనే బీజేపీ, శివసేన మధ్య పొత్తు జరిగిందని శివసేన మంత్రి రామ్‌దాస్‌ కదం వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందానికి కట్టుబడకూడదని భావిస్తే ఎన్నికలకు ముందుగానే బీజేపీ తన పొత్తును రద్దుచేసుకోవచ్చని బుధవారం స్పష్టం చేశారు. బీజేపీ, శివసేన మధ్య రెండు ప్రధాన అంశాల గురించి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పాటు పంచుకోవటం ఒకటి కాగా.. కొంకణ్‌ ప్రాంతంలోని నానార్‌ రిఫైనరీ ప్రాజెక్టును రద్దు చేయడం రెండోదని వెల్లడించారు. కాగా, ఒప్పందం జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌ పటేల్‌ పొత్తును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్‌దాస్‌ పరోక్షంగా మండిపడ్డారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top