ఓటమి షాక్ : రమణ్‌సింగ్ రాజీనామా

రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా, బీజేపీని ఓటమి భారం వెంటాడుతోంది.
ఇక బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రరమణ్ సింగ్ 15 సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్ సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన నాయకత్వంలో ఎన్నికలు వెళ్లినందున ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి