ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌

Rajya Sabha Elections: CM YS Jagan casts his vote In Assembly Committee Hall - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కాగా ముఖ్యమంత్రి తన ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్‌ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరఫున వర్ల రామయ్య బరిలో ఉన్నారు. (ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top