రజనీ రాజకీయాల్లోకి రారు.. అన్నీ సినీ స్టంట్లే..! | Rajinikanth will not Join in politics, Says congress Leader | Sakshi
Sakshi News home page

Nov 5 2018 8:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

Rajinikanth will not Join in politics, Says congress Leader - Sakshi

సాక్షి, చెన్నై : రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ వ్యాఖ్యానించారు. కొత్త సినిమాల విడుదల సమయంలో సినీ స్టంట్‌ తరహాలో ఏదో ఒక ప్రకటనను ఆయన ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, ఎవరి వాదనలు వారివేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. అయితే, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే, తమిళ ప్రజలు మరెన్నో ఏళ్లు ఆయనను కొనియాడుతారని తెలిపారు. తనకు తెలిసినంత వరకు ఆయన రాజకీయాల్లోకి రారూ..! అన్నది స్పష్టం అవుతోందన్నారు.

సినిమాల బిజీలో ఉంటూ, సినిమా విడుదల సమయంలో సినీ తరహా స్టంట్‌ అన్నట్టుగా ఏదో ఒక ప్రకటన ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. అంతేగానీ, పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి రావడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి.. పోతూఉంటాయని, అయితే, రజనీ మాత్రం రాజకీయాల్లోకి రారూ.. అన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement