‘ఈ డ్రామాలో ఢిల్లీ ప్రజలే అసలైన బాధితులు’

Rahul Gandhi Words On Arvind Kejriwal Strike At LG Residence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత వారం రోజులుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇంట్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ఆప్‌ నేతలు చేస్తోన్న దీక్షపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారం రోజుల నుంచి కేజ్రీవాల్‌ దీక్ష గురించి మౌనంగా ఉన్న రాహుల్‌... సోమవారం ప్రధాని మోదీ, కేజ్రీవాల్‌ తీరును విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. పాలన పక్కన పెట్టి దీక్ష చేస్తోన్న అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు.. ఆయనకు కౌంటర్‌గా దీక్షకు దిగిన బీజేపీ నేతల తీరును కూడా రాహుల్‌ తప్పు పట్టారు.

‘ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆఫీస్‌లో ధర్నా చేస్తున్నారు. బీజేపీ వాళ్లు సీఎం నివాసం వద్ద ధర్నాకు కూర్చున్నారు. ఇక ఢిల్లీ బ్యూరోక్రాట్లు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ అరాచకం ప్రధానికి మాత్రం కనబడటం లేదు. ఇక్కడ జరుగుతున్న డ్రామాలో ఢిల్లీ ప్రజలే అసలైన బాధితులు’  అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top