ఇప్పుడు ఏం చేస్తారో..?

Rahul Gandhi Tweets On Supreme Court Order - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. కర్ణాటక గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని నిర్దారించింది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన బీజేపీని కోర్టు నియంత్రించింది. చట్టపరంగా ఇప్పుడు వారేం చేయలేరు. ఇక ధనబలం, కండబలంతో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెడతారంటూ’  ట్వీట్‌ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం  శుక్రవారం తీర్పును వెలువరించింది. రేపు (శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను సైతం తిరస్కరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top