
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు నిర్ణయంపై ఈ నెల 20లోగా స్పష్టత వస్తుందని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పార్టీ సంసిద్ధం కావాలని అధిష్టానం సూచిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే మేనిఫెస్టో, అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులపై కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకైతే పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని చెప్పారు.