మే 14న అతి ముఖ్యమైన రోజు..!

PrajaSankalpaYatra To Surpass 2000 KMs Mark In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల పైలాన్ పనులను ఆయన పర్యవేక్షించారు.

ఈ నెల 14వ తేదీ వైఎస్సార్‌ అభిమానులకు అతి ముఖ్యమైన రోజని తెలిపారు. 15 సంవత్సరాల క్రితం 2003 మే14న పాదయాత్రలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాలోని కామవరపుకోటలో భారీ సభ నిర్వహించారు. అదే రోజున వైఎస్ జగన్‌ 2000 కి.‌మీ పాదయాత్రను పశ్చిమగోదావరిలో పూర్తి చేసుకుని ఏలూరు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని వెల్లడించారు.

వైఎస్సార్‌ తనయ షర్మిల సైతం పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడు వద్ద 2 వేల కిలోమీటర్లు మైలురాయిని దాటారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు పాలన ఎలా సాగిందో.. ఇప్పుడూ అదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రతో విచ్చేస్తున్న వైఎస్‌ జగన్‌ కోసం జిల్లా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top