‘ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు’ | Posani Krishna Murali Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం : పోసాని

Jan 15 2019 2:14 PM | Updated on Jan 15 2019 6:01 PM

Posani Krishna Murali Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : ప్రత్యర్థుల ఇంట్లో వాళ్లపై ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పోసాని కృష్ణ మురళి విమర్శించారు. గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై పుకార్లు పుట్టించారన్నారు.

ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరిపై అదే పంథాను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన కడప శివారులోని ఇర్కాన్‌ సర్కిల్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ ఎన్నికల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జీవితాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement