‘నాయిని’ తూటాలు లేని తుపాకీ: పొన్నం | Ponnam Prabhakar fires on Minister Naini | Sakshi
Sakshi News home page

‘నాయిని’ తూటాలు లేని తుపాకీ: పొన్నం

Aug 18 2018 3:13 AM | Updated on Aug 30 2019 8:24 PM

Ponnam Prabhakar fires on Minister Naini - Sakshi

సిరిసిల్ల: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తూటాలు లేని తుపాకీ లాంటివాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అభివృద్ధి కనిపిస్తలేదా.. అయితే కంటి పరీక్షలు చేయించుకో? అనే నాయిని వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. ‘మా కళ్లు బాగానే ఉన్నాయి.. మీరే మెదడు పరీక్ష చేయించుకోవాలి’అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్‌ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  ప్రజలకే కాదు.. దేవుడికి ఇచ్చిన హామీని కూడా విస్మరించడంలో కేసీఆర్‌కు మించినోడు లేడని ధ్వజమెత్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement