ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం

Newly Elected Telangana MLCs Swearing In Ceremony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలికి ఇటీవల ఎన్నికైన ఏడుగురు కొత్త సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్‌ హసన్‌ ఎఫెండి... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎ.నర్సిరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి హాజరయ్యారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top