మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌ | Nara Lokesh rubbishes TTDP Merger into TRS | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌

Jan 18 2018 3:33 PM | Updated on Aug 29 2018 3:37 PM

Nara Lokesh rubbishes TTDP Merger into TRS - Sakshi

సాక్షి, అమరావతి : తెలంగాణలో తెలుగుదేశ పార్టీ(టీటీడీపీ)ని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)లో విలీనం చేయాలంటూ టీటీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు.

నర్సింహులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ప్రాభవాన్ని కోల్పోతోందని అందరూ అంటున్నారని, ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌ రాలేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నారా లోకేష్‌.. కలెక్టర్లతో సమావేశం ఉన్నందు వల్లే ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాలేకపోయారని చెప్పారు. విజయవాడలో ఎన్‌టీఆర్‌కు ముఖ్యమంత్రి నివాళులు అర్పించినట్లు తెలిపారు. పార్టీలో స్థానం కోరుకునే వారు ఎవరైనా పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement