పార్టీల చూపు.. ముథోల్‌ వైపు | Muthol Voters Are Decision Makers Of Electing A Candidate In Adilabad District | Sakshi
Sakshi News home page

పార్టీల చూపు.. ముథోల్‌ వైపు

Mar 30 2019 12:15 PM | Updated on Mar 30 2019 12:15 PM

Muthol Voters Are Decision Makers Of Electing A Candidate In Adilabad District - Sakshi

సాక్షి, భైంసా: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ముథోల్‌ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానంలో గెలుపొటములపై ముథోల్‌ ఓటర్లే ప్రభావంచూపుతారు. ముథోల్‌ ఓటర్లు ప్రత్యేకంగా తీర్పుచెబుతూ వస్తున్నారు. ముథోల్‌ నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆశలుపెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 83703, బీజే పీకి 40339, కాంగ్రెస్‌కు 36396 ఓట్లు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో విఠల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో అధికారపార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంపై భారీ ఆశలు పెంచుకుంది. ఇప్పటికే దేవాదయ, ధర్మాదాయ, న్యా య, అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారపర్వం ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి కుభీర్, కల్లూరు, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూరు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. ముఖ్యకార్యకర్తలతో ప్రత్యేక బేటీలుజరుపుతున్నారు. పా ర్లమెంట్‌ ఎన్నికల్లోనూ ముథోల్‌ నుంచి భారీ మెజార్టీ కోసం పావులుకదుపుతున్నారు.  

భైంసాపైనే..
కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ కేంద్రమైన భైంసాపైనే ప్ర త్యేక దష్టిసారించింది. భైంసా పట్టణంలో అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉండడంతో పార్టీ లాభంచేకూరుస్తుందని ఆశలు పెంచుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌కు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఎంపీగా, జడ్పీచైర్మన్‌గా ఉన్న సమయంలో తనకంటూ ఉన్న ప్రత్యే క క్యాడర్‌తో ముందుకువెళ్తున్నారు. మరోవైపు నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన పవార్‌ రామారావుపటేల్‌ సొంత నియోజకవర్గం ముథోల్‌ కావడంతో ప్రతిష్టాత్మకంగాతీసుకున్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపుతో జోష్‌ లో ఉన్న పార్టీ శ్రేణులు ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేలా ప్రచారం ముమ్మరంచేశారు. భైంసాలోని ఎస్‌ఎస్‌ జిన్నింగు ఫ్యాక్టరీలో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ప్రచారంచేపడుతున్నారు.  

యువకుల ఓట్లపై..
నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి ర మాదేవి సొంత నియోజకవర్గమైన ముథోల్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సా«ధించేలా పావులుకదుపుతున్నారు. బీజేపీ అభ్యర్థి సో యంబాపురావుతో ఇప్పటికే భైంసా పట్టణంలో ప్రచార కార్యక్రమంచేపట్టారు. నియోజకవర్గ కా ర్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటుచేశారు. ఎ లాగైన బీజేపీకి ముథోల్‌ నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులుచెబుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకుభిన్నంగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే ఓట్లువస్తాయని లెక్కలువేస్తున్నారు. ఇలా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లెక్కలువేస్తూ నియోజకవర్గంలో ప్రచార పర్వం ముమ్మరంచేస్తున్నారు. నామినేషన్‌ల పర్వం ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారంపైనే ప్రధాన పార్టీలు దష్టిసారించాయి. దీంతో విజయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.

సేవకుడిగా ఉండాలి
సమాజంలో గెలిచే ప్రజాప్రతినిధులు సేవకుడిగా ఉండాలి. ప్రజా ఓట్లతో గెలిచినవారు ప్రజా సమస్యలపై పోరాడాలి. అమలుకు నోచుకోని హామిలకు ప్రజలు ఆకర్షితులు కావద్దు. 

– మాధవ్‌రావుపటేల్, సిద్దూర్‌ 

సమర్థులనే ఎన్నుకోవాలి  
సమర్థులను ఎంచుకుంటే ప్రాంతం అభివద్ధిచెందుతుంది. ప్రజా సమస్యలపైన పట్టున్నవారిని ఎన్నికల్లో గెలిపించాలి. అలాంటప్పుడే వారు ఆ సమస్యలపై మాట్లాడి పరిష్కారానికి మార్గంచూపుతారు. ప్రతి ఒక్కరు సమర్థులు ఎవరా అని నిర్ధారించుకోవాలి.– రాజేశ్వర్, భైంసా

అందుబాటులో ఉండాలి
ప్రజా క్షేత్రంలో ఎంతో మంది వచ్చిన అందుబాటులో ఉండేవారు కొందరే. రాత్రైన పగలైన గెలిపించిన వారిని పక్కాగా సేవలు అందించాలి. ఎంతో నమ్మకంతో గెలిపించిన ఓటర్లను మరిచిపోయే వారు ఉండకూడదు. ప్రజలు సైతం బాధ్యతాయుతంగా ఓట్లను వేయాలి. ఓటు హక్కు సద్వినియోగంచేసుకుని అందుబాటులో ఉండేవారిని గెలిపించాలి. పనిచేసేవారికే పట్టం కట్టాలి.– నిఖిల్, తిమ్మాపూర్‌  
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement