‘టీడీపీలో చేరలేదు.. మద్దతే ఇస్తున్నా’ | Mp butta renuka comments on her political issue with tdp | Sakshi
Sakshi News home page

 ‘టీడీపీలో చేరలేదు.. మద్దతే ఇస్తున్నా’

Oct 18 2017 1:40 AM | Updated on Aug 9 2018 8:15 PM

Mp butta renuka comments on her political issue with tdp - Sakshi

సాక్షి, అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని, మద్దతు మాత్రమే ఇస్తున్నానని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును ఆమె మంగళవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను వైఎస్సార్‌సీపీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారో తెలియదని, తన భర్త వైఎస్సార్‌సీపీతో విభేదించినా.. తాను మనస్ఫూర్తిగానే పార్టీకోసం పనిచేశానని చెప్పారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారో విశ్లేషించేంత అనుభవం తనకు లేదని వ్యాఖ్యానించారు.

తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంపై అందరికీ స్పష్టత ఇవ్వడానికే బహిరంగంగా వచ్చి బాబుకు మద్దతు తెలిపానని రేణుక చెప్పారు. కాగా, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులవుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇంకా కొంతమంది త్వరలో టీడీపీలోకి వస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement