మోదీ అంటే లవ్వే లేదా?

Modi Putin Low Priority to PM Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల అధినేతలతో కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన వైఖరి మార్చుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నీమధ్యే కిమ్‌ జంగ్‌ ఉన్‌తో.. ఆ తర్వాత ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరుపుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో వివిధ దేశాల అధినేతల మధ్య సత్సంబంధాలు, వాళ్ల ఫోన్‌కాల్స్‌ సంభాషణల గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

రూటర్స్‌ డేటా ప్రకారం... జనవరి 2017లో ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూలై 6 2018 దాకా మొత్తం 40 మంది దేశాధినేతలకు ఫోన్‌ కాల్స్‌ చేశారు. వాటి సంఖ్య సుమారు 200 పైమాటే. అదే సమయంలో పుతిన్‌.. 50 మంది అధినేతలకు 190 దాకా కాల్స్‌ చేశారు. ట్రంప్‌ కాల్స్‌లో ఎక్కువగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రోన్‌(25)కు గరిష్ఠంగా ఉండగా.. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే, సౌత్‌ కొరియా అధ్యక్షుడు మూన్‌, సౌదీ రాజు సల్మాన్‌లు ఉన్నారు. మరోవైపు పుతిన్‌ ఫోన్‌ కాల్స్‌లో టర్కీ అధ్యక్షుడిగా రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌(27 కాల్స్‌), నజర్‌బయెవ్‌(కజకిస్థాన్‌), మాక్రోన్‌(ఫ్రాన్స్‌), మెర్కల్‌(జర్మనీ), నెతన్యాహు(ఇజ్రాయెల్‌) తదితరులు ఉన్నారు.

మోదీ సంగతేంటి... ట్రంప్‌-పుతిన్‌.. ఇద్దరితోనూ కలుపుగోలుగా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ. పలు పర్యటనల్లో ఈ విషయం రుజువు చేసే విధంగా వాళ్లిద్దరూ మోదీతో మెదిలారు కూడా. అలాంటిది ఇద్దరి లిస్ట్‌లో కూడా మోదీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావటం గమనార్హం. పరస్పర సంబంధాల విషయంలో కాకపోయినా.. కనీసం కలుపుగోలుగా కూడా ఎక్కువగా వీళ్ల మధ్య ఎక్కువగా సంభాషణ లేకపోవటం గమనార్హం అంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్యాల అధినేతల ప్రయారిటీ లిస్ట్‌లో మన ప్రధానిపై లేరంటూ సెటైర్ల పర్వం కురుస్తోంది.

కొసమెరుపు.. ట్రంప్‌-పుతిన్‌లు అత్యధిక కాల్స్‌ చేసిన మాక్రోన్‌, ఎర్డోగన్‌లను ఉద్దేశిస్తూ.. సోషల్‌ మీడియాలో కొందరు ‘లవ్‌’ పోస్టులను పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top