మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందే: ఒవైసీ

Modi May Lose Vote Says Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యోగా గురు రామ్‌దేవ్‌ బాబా జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. రామ్‌దేవ్‌ బాబా జనాభాను తగ్గించేందుకు మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతోపాటు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పేర్కొనడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు మాట్లాడేవారిని నిలువరించడానికి ఎలాంటి చట్టాలు లేవు. అయినా రామ్‌దేవ్‌ బాబా ఆలోచనలకు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది? రామ్‌దేవ్‌ బాబా పొట్టతో చేసినట్టో లేక కాళ్లు ఆడించినట్టో కాదు. అలా అయితే మూడో సంతానం కాబట్టి మోదీ కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది’అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top