బాబూ.. గిరిజనులు ఇప్పుడు గుర్తొచ్చారా..!

MLA Pushpa Srivani slams Chandrababu Naidu - Sakshi

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

విజయనగరం, కొమరాడ: నాలుగున్నరేళ్లుగా గిరిజనులను పట్టించుకోని ముఖ్యమంత్రికి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గుర్తొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు. మండలంలోని పెద్దశాఖ, పూడేసు గ్రామాల్లో సోమవారం ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను మేళతాళాల నడుమ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, గిరిజనులను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు టీడీపీ నాయకుల మోసపూరిత హామీలు నమ్మరన్నారు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబుకు మించిన వారు ఉండరని చెప్పారు.

మీ మాయమాటలు నమ్మే స్థితిలో గిరిజనులు లేరన్నారు. ఓట్ల కోసమే ‘పుసుపు – కుంకుమ’ డబ్బులు ఇచ్చారని.. ఈ విషయంలో మహిళలు మోసపోవద్దని సూచించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో డ్వాక్రా, రైతు రుణమాఫీ  చేయలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమాల్లో మండల వైస్సార్‌ కన్వీనర్‌ ద్వారపురెడ్డి జనార్దననాయుడు, డాక్టర్‌ శెట్టి మధుసూదనరావు, కలప శంకరావు, హిమరిక పకీరు, కోడి తిరుపతినా యుడు, గంటా వెంకటినాయుడు, నాలి గంపస్వామి, సీఎచ్‌ నూకరాజు, అధికారి శ్రీనివాసరావు,అధికారి విశ్వనాథంనాయుడు, బాలకృష్ణ, ఎం.బాస్కరరావు, పైల వెంకటరమణ, రాజేష్, కె.రవికూమర్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top