breaking news
mla pushpa srivani
-
బాబూ.. గిరిజనులు ఇప్పుడు గుర్తొచ్చారా..!
విజయనగరం, కొమరాడ: నాలుగున్నరేళ్లుగా గిరిజనులను పట్టించుకోని ముఖ్యమంత్రికి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గుర్తొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు. మండలంలోని పెద్దశాఖ, పూడేసు గ్రామాల్లో సోమవారం ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను మేళతాళాల నడుమ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, గిరిజనులను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు టీడీపీ నాయకుల మోసపూరిత హామీలు నమ్మరన్నారు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబుకు మించిన వారు ఉండరని చెప్పారు. మీ మాయమాటలు నమ్మే స్థితిలో గిరిజనులు లేరన్నారు. ఓట్ల కోసమే ‘పుసుపు – కుంకుమ’ డబ్బులు ఇచ్చారని.. ఈ విషయంలో మహిళలు మోసపోవద్దని సూచించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో డ్వాక్రా, రైతు రుణమాఫీ చేయలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమాల్లో మండల వైస్సార్ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దననాయుడు, డాక్టర్ శెట్టి మధుసూదనరావు, కలప శంకరావు, హిమరిక పకీరు, కోడి తిరుపతినా యుడు, గంటా వెంకటినాయుడు, నాలి గంపస్వామి, సీఎచ్ నూకరాజు, అధికారి శ్రీనివాసరావు,అధికారి విశ్వనాథంనాయుడు, బాలకృష్ణ, ఎం.బాస్కరరావు, పైల వెంకటరమణ, రాజేష్, కె.రవికూమర్, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
-
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
-
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
విజయవాడ: చేయని తప్పుకు ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళల సమస్యలపై నిలదీస్తున్న రోజా గొంతు నొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి సభలో మాట్లాడటానికి అవకాశం ఇస్తుందని భావించాం. అయితే ప్రతిపక్ష నేతపై ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తోందో గమనించే ఉంటారు. సమస్యలను లేవనెత్తితే...ఆ అంశాలను పక్కదాని పట్టించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. చేయని తప్పుకు రోజా 14 నెలలు శిక్ష అనుభవించారు. మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరమీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూడటం దారుణం. రోజా చేసిన తప్పేంటి?. టీడీపీ సర్కార్ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రితేశ్వరి ఆత్మహత్యం అంశం, కాల్‌మనీ దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారనే కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ అంశాన్ని నిలదీసిందుకా? లేక విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుకా రోజాను సస్పెండ్ చేసింది. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?. దళితల కోసం ఏనాడు పోరాటం చేయని అనితా ఈరోజు రాజకీయ మైలేజ్ కోసం రోజాను ఇరికిస్తున్నారు. హత్య చేసిన ఖూనీకోరుకు ఒకేసారి శిక్షవేస్తారు. అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని... అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్ చేసిన రోజాను... ప్రభుత్వం వివరణ అడగకపోవడం మహిళగా సిగ్గుపడుతున్నా. మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.’ అని అన్నారు. -
గిరిజన ఎమ్మెల్యే అంటే చులకనా?
కురుపాం : గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చులకనా..? అధికారుల తీరు మారకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధికారులను హెచ్చరించారు. శనివారం కురుపాం ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి అధక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీఓ నంబర్ 520 ప్రకారం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ ఇతర ప్రాంతాల నాయకులను తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని మండల స్థాయి అధికారులకు హితవు పలికారు. ఇదే పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక తప్పదని హెచ్చరించారు. -
చలించి...స్పందించి
గరుగుబిల్లి మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామమది. అక్కడ 280 గడపలున్నాయి. 320 కుటుంబాల్లో 1350 మంది నివసిస్తున్నారు. నిర్వాసిత గ్రామమైన ఈ ఊరు... కూలిన పెంకుటిళ్లు, ధ్వంసమైన రోడ్లు, శిథిలమైన పాఠశాల భవనం, సమస్యలతో పోరాడలేక నీరసించిన జనంతో దయనీయంగా మారింది. నాగావళికి వ రదలొచ్చినప్పుడు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. పంటపొలాల్లోంచి బురదనీరు గ్రామంలోకి ప్రవేశిస్తుండడంతో వీధులన్నీ చెమ్మగా మారిపోతాయి. నందివానివలసతో పాటు తోటపల్లి గ్రామంలో కూడా అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజల ఇక్కట్లను ప్రత్యక్షంగా చూసి, వారి బాధలు వినేందుకు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వారి కష్టాలు విని చలించిపోయారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాముల పుష్ప శ్రీవాణి: నమస్తే... నాపేరు పాముల పుష్ప శ్రీవాణి. నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. పుష్ప శ్రీవాణి: బాబు నీ పేరు ఏమిటీ.. సమస్య ఏంటీ ? సతీష్‌కుమార్ : మేడమ్.. నా పేరు సతీష్‌కుమార్, మా ఊర్లో 18 ఏళ్లు నిండిన యువకులకు పునరావాస ప్యాకేజీ మంజూరు చేయలేదు? మా కన్నా ముందు నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించిన ఊళ్లలో వారికి ప్యాకేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎందుకు ప్రభుత్వం వివక్ష చూపించిందో తెలియడం లేదు? పుష్పశ్రీవాణి: ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చలించి...స్పందించి తగున్యాయం చేస్తాను. పుష్పశ్రీవాణి: అమ్మా...నీ పేరేంటి, నీ సమస్య ఏంటి ? ఒమ్మి త్రినాథమ్మ: నా పేరు త్రినాథమ్మ, అసలు మాట దేవుడు ఎరుగు, వడ్డ్డీలు తడిసిమోపుడవుతున్నాయి. డ్వాక్రా రుణాలు తీర్చే మార్గం కనిపించడంలేదు. మీరే సమస్యపరిష్కరించాలి. పుష్పశ్రీవాణి: ఈవిషయమై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. పుష్ప శ్రీవాణి : ఎలా ఉన్నారు, మీ పేర్లేంటి ? గొల్లు మహాలక్ష్మి: నాపేరు మహాలక్ష్మి , 70 ఏళ్లు నిండినా పింఛన్ మంజూరు కాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదు. రెడ్డి పోలమ్మ: నా పేరు పోలమ్మ, భూమి ఎక్కువుగావుందని మూడు నెలలనుంచి పింఛను నిలిపేశారు. కొడుకులు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఎలా బతకాలమ్మ ? పుష్పశ్రీవాణి: అధికారులతో చర్చించి పింఛన్ మంజూరుకు కృషిచేస్తాను. పుష్ప శ్రీవాణి : నీ సమస్య ఏంటి ? గొర్లి శంకర్: మేడమ్.... మేము ఎస్టీ నిరుపేద కుటుంబానికి చెందినవారిమండి, మాకు అంత్యోదయ కార్డుకూడా మంజూరు చేయడంలేదు. పుష్పశ్రీవాణి: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేసిన సమయంలో అంత్యోదయ కార్డు వచ్చేలా అధికారులతో మాట్లాడతాను. పుష్పశ్రీవాణి: ఏంటమ్మా ఏమైనా సమస్యలున్నాయా ? అంపెల్లి గంగమ్మ: గ్రామంలో కుళాయికూడా లేదు మేడమ్. పుష్పశ్రీవాణి: నందివానివలస నిర్వాసిత గ్రామం కావడంతో ప్రభుత్వం రక్షిత పథకాలను మంజూరు చేయడం లేదు. పునరావాసం కల్పించిన తరువాత కుళాయి ఏర్పాటు చేస్తాం. పుష్పశ్రీవాణి: మీ పేర్లేంటి, ఎంటి మీ సమస్య ? మరడాన అప్పలనాయుడు: మేడమ్ నా పేరు అప్పలనాయుడు. పునరావాసం కల్పించేందుకు అధికారులు పట్టించుకోవడంలేదు. గ్రామానికి మూడేళ్ల క్రితం పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీను ఇచ్చారు. కానీ ఇంతవరకు పునర్నిర్మాణం కోసం స్థల సేకరణ కూడా చేయలేదు. ఉన్న ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. రెడ్డి హరికృష్ణ: నాపేరు హరికృష్ణ మేడమ్. ఈ ఊళ్లో ఎలా బతకాలో తెలియడంలేదు. ఉన్న ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిత్యం అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని జీవిస్తున్నాం. ఇళ్ల మరమ్మతులు కూడా చేసుకోలేని స్థితిలోవున్నాం. రెడ్డి సత్యనారాయణ: ఇళ్ళుపెచ్చులూడిపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. వర్షాలువస్తే నరకం చూస్తున్నాం. పుష్పశ్రీవాణి: పునరావాసంపై పార్వతీపురం సబ్‌కలెక్టర్‌తో ఇప్పటికే పలుమార్లు చర్చించాను. మళ్లీ మరోసారి చర్చించి గ్రామానికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతాను. పుష్పశ్రీవాణి: మీ సమస్య ఏంటి ? కర్రి ఎల్లంనాయుడు: నాపేరు ఎల్లంనాయుడండి...వరదనీరు గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. మురుగు చేరడంతో వ్యాధులు బారినపడుతున్నాం. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదు. పుష్పశ్రీవాణి: ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి గ్రామంలోకి వరదనీరు రాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతాను. పుష్ప శ్రీవాణి : చెప్పండమ్మ... నీ సమస్య ఏంటమ్మ ? గొల్లు ధనుంజయమ్మ: ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం తయారీకి వంటశాల లేకపోవడంతో ఆరుబయటే వంటలను చేస్తున్నాం. వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పుష్పశ్రీవాణి: వంటశాల నిర్మాణానికి ఉన్నతాధికారులతో చర్చిస్తాను. పుష్పశ్రీవాణీ: మీ ఊరికి వచ్చే వంతెన ప్రమాదకరంగా ఉంది... ఎప్పటి నుంచి ఇలా ఉంది ? రొక్కలి సత్యనారాయణ: ఏళ్ల తరబడి దీని పరిస్థితి ఇలాగే ఉంది. ఎంత మంది అధికారులు, నాయకులకు చెప్పినా సుఖం లేదు.. తరచూ చాలా మంది వంతెన మీద నుంచి పడిపోతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాలు మిగులుతున్నాయి. పుష్పశ్రీవాణీ: చెప్పమ్మా.. ఏమిటీ సమస్య. లలిత: అమ్మా! రుణమాఫీ అన్నారు. డబ్బులు రాలేదు సరికదా, మా పొదుపు డబ్బులు ఇరిపేస్తున్నారు. పార్వతి: బ్యాంకులకు వెళితే నోటీసులు ఇస్తామంటున్నారు. పుష్పశ్రీవాణీ: చంద్రబాబు మాటలు నమ్మి అధికారం ఇస్తే ఇలాగైందన్న బాధ ఇప్పుడు అందరిలో ఉంది. ప్రతీ పైసా మాఫీ అయ్యే వరకూ మీకు అండగా ఉంటాం. పుష్పశ్రీవాణీ: మీ ఇబ్బంది ఏంటమ్మ...? చంద్రమ్మ : నా భర్త చనిపోయి రెండేళ్లు అయ్యింది.. అయినా ఇప్పటివరకూ వితంతు పింఛను ఇవ్వకుండా తిప్పుతున్నారు.. పుష్పశ్రీవాణీ: జన్మభూమిలో దరఖాస్తు పెట్టినా ఇవ్వడం లేదా... సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. అప్పయ్యమ్మ: అమ్మా... నాకు చేతులు పనిచేయవు, కళ్లు కనిపించవు., అయినా పింఛను ఇవ్వడం లేదు., పుష్పశ్రీవాణీ : ఏం, ఎందుకని ఇవ్వడం లేదు.. అప్పయమ్మ: అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్లో 20 శాతం అంగవైకల్యం ఉందని రాశారు. అందుకే ఇవ్వడం లేదట పుష్పశ్రీవాణీ: లేదు.. ఇక్కడ సదరంలో ధ్రువీకరించి పింఛను వచ్చేటట్టు చేస్తాను పుష్పశ్రీవాణీ: చెప్పండమ్మా ... మీ సమస్య ఏంటి? పెదపెంకి రమణ, లక్ష్మి: అమ్మా మాకు రేషను కార్డులు లేవని బంగారుతల్లి పథకం ఇవ్వడం లేదు..చాలా ఇబ్బందిగా ఉంది పుష్పశ్రీవాణీ: రేషను కార్డు వచ్చేలా చేస్తా...అలాగే మీ గ్రామంలో సమస్యల పరిష్కారాని ప్రయత్నిస్తాను. మళీ కలుద్దాం...