నెల్లూరు (సెంట్రల్): నియోజకవర్గంలో ఈ నెల 26 నుంచి ప్రజాదీవెన కార్యక్రమం చేపడుతున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. స్థానిక ఎంసీఎస్ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ప్రజాదీవెనలో భాగంగా గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఇటీవల చేపట్టిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం విజయవంతంగా సాగిందని, ఈ కార్యక్రమం ద్వారా 40 వేల కుటుంబాలకు చేరవయ్యామని వివరించారు. ప్రజాదీవెన కార్యక్రమంతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ప్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
